కొండపి: ఒంగోలు, సింగరాయకొండ రైల్వే స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీసులు, పలు ప్రయాణికుల బ్యాగులు తనిఖీలు
ప్రకాశం జిల్లా ఒంగోలు, సింగరాయకొండ రైల్వే స్టేషన్లను శనివారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తుల బ్యాగులను అధికారులు చెక్ చేశారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో గంజాయి తరలింపు అడ్డుకునేందుకు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. గంజాయిని గుర్తించే కార్యక్రమం మరియు నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలను కట్టుదిట్టంగా పాటిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.