రాయదుర్గం: ఎర్రటి దుమ్ముతో కమ్మేస్తున్న రాయదుర్గం - బళ్ళారి ప్రధాన రహదారి, అధికారుల చర్యలు శూన్యం
రాయదుర్గం - బళ్ళారి ప్రధాన రహదారిపై సోమలాపురం రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ వ్యాగన్ నుంచి మైనింగ్ మట్టి అన్ లోడింగ్ కారణంగా గత కొద్ది రోజులుగా విపరీతమైన ఎర్రటి దుమ్ము ఎగిరి రోడ్డుపైకి వస్తోంది. దీంతో బైక్ పై వెళ్లే వారి దుస్తులపై మట్టి చేరుతూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము కారణంగా రోడ్డుపై వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.