రాప్తాడు: అనంతపురం రూరల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీటీసీ నామినేషన్ సందర్భంగా రూరల్ వైసీపీ నేతలపై రాళ్లతో దాడి చేసిన టిడిపి నేతలు
అనంతపురం జిల్లా కేంద్రంలో రూరల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రూరల్ వైసీపీ పార్టీ మండల కన్వీనర్ బండి పవన ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేసేందుకు ఎంపీటీసీ అభ్యర్థులు వెళ్తున్న సందర్భంలో రూరల్ మండలంలోకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు నామినేషన్ దాఖలు చేసేందుకు వస్తున్న వైసిపి నేతలను అడ్డుకొని ఎంపీటీసీ అభ్యర్థులపై రాళ్లతో దాడులు చేయడం జరిగింది దీంతో పలువురు వైసిపి పార్టీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థులు తీవ్రంగా గాయపడడం జరిగింది, ఈ సంఘటన గమనించిన స్థానిక పోలీసులు ఇరు పార్టీలను నామినేషన్ కేంద్రం వద్ద నుంచి ఇరువర్గాలను పోలీసులు చదరగొట్టారు