ఉరవకొండ: బెలుగుప్ప పీ హెచ్ సీ లో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభయాన పథకం భాగంగా గర్భవతులకు వైద్య చికిత్సలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభయాన పథకం భాగంగా గురువారం వైద్యాధికారులు ప్రియాంక, హిమబిందుల ఆధ్వర్యంలో వివిధ గ్రామాల గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతినెల హైరిస్క్ గర్భవతులను గుర్తించి, పరీక్షించి వారికి రక్త శాతం, BP పరీక్షలు చేయడం, అంగన్వాడి కేంద్రంలో ఇచ్చు పౌష్టికాహారం, మంచి ఆకుకూరలు తీసుకోవాలని ఆరోగ్య సలహాలు తెలపడం జరిగినది. గర్భిణీ స్త్రీలు బాలింతలకు మాత శిశు మరణాలు జరగకుండా చూసుకోవాలని తల్లులకు చెప్పడం జరిగినది. పాటిల్ చంద్రశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం కుమారుడు కొండారెడ్డి అన్నదానం నిర్వహించారు.