రాప్తాడు: ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు అనంతపురం జిల్లా కరువు సమస్య పట్టదా అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శలు
అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల 40 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సిపిఐ కరువు దీక్షలకు మద్దతు తెలపడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి రోజున రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రాప్తాడు పర్యటనలు రైతు సమస్యల గురించి ప్రస్తావించకపోవడం అన్యాయమని ఒక శాఖ మంత్రి అయింది కూడా జిల్లాలో కరువుతో రైతులు వలస వెళ్తుంటే కనీసం ఒక రైతును కూడా పరామర్శించకుండా కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని నారా లోకేష్ పర్యటన పై రాప్తాడు మాజీ తోపుదుర్తి ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి విమర్శించారు.