సంతనూతలపాడు: మల్లవరం కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునః నిర్మాణ పనులు
మద్దిపాడు మండలం మల్లవరం కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పున: నిర్మాణ పనులు సరే వేగంగా చేపట్టేందుకు దేవదాయ శాఖ, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా విమాన గోపురం అంతరాలయం గర్భాలయం పునః నిర్మాణ పనుల్లో భాగంగా వాటి తొలగింపు చర్యలను చేపట్టారు. ఆలయంలో భక్తుల రద్దీకి తగ్గట్టుగా పునర్నిర్మాణ పనులలో వసతి సౌకర్యాలను కల్పించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు గురువారం తెలిపారు.