దర్శి: దర్శి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా అష్టలక్ష్మి వ్రతం
Darsi, Prakasam | Aug 23, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అష్టలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన కార్యదర్శి సుబ్బారావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అనంతరం ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.