యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టుకు త్వరలో నీటిని విడుదల చేయుటకు ప్రభుత్వం ట్రయల్ రన్
మార్కాపురం జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టుకు త్వరలో నీటిని విడుదల చేయుటకు ప్రభుత్వం ట్రయల్ రన్ నిర్వహించబోతుంది. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ సీఈ రమేష్ సుంకేసుల గొట్టిపడియా ప్రాంతాలలోని చెక్ డ్యాములను పరిశీలించారు. ఆగస్టు 26 లోగా పెండింగ్ పనులను పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు అధికారులకు తెలిపారు. మిగిలిన నిర్వాసితులకు నష్టపరిహారం అందుతుందన్నారు.