రాయదుర్గం: గ్రామదట్ల గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య
రాయదుర్గం మండలం గ్రామదట్ల గ్రామానికి చెందిన రామ్మూర్తి(55) శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామ్మూర్తి శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. బంధువులు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ఆచూకి లభించలేదు. దీంతో శనివారం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అన్వేషణలో భాగంగా గ్రామదట్ల గ్రామం సమీపంలోని వంక వద్ద ఉన్న ఒక చెట్టుకు రామ్మూర్తి ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న కనేకల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.