రాయదుర్గం: VRAల సమస్యలు పరిష్కరించాలి - MRPS
VRAల సమస్యల పరిష్కారం కోసం గత 13 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షకు MRPS జిల్లా మాజీ అధ్యక్షుడు హరగోపాల్ మాదిగ సంపూర్ణ మద్దతు తెలిపారు. గుమ్మగట్ట లో జరిగిన దీక్షల్లో పాల్గొన్నారు. పే స్కేల్ అమలు, ఇన్చార్జి VRAల రెగ్యులర్, VRA లుగా ప్రమోషన్, కారుణ్య నియామకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తాలూకా అధ్యక్షుడు గలగల శ్రీను మాదిగ, విఆర్ఏ లు తదితరులు పాల్గొన్నారు.