దర్శి: కురిచేడు మండల కేంద్రంలో వర్షాలు సమృద్ధిగా పడాలని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
Darsi, Prakasam | Aug 20, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో వర్షాలు సమృద్ధిగా పడాలని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ట్రాక్టర్ ఫై చిన్నపాటి ప్రభాను తయారు చేసుకొని భాజా భజంత్రీలతో ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. మహిళలు రంగులు జల్లుకుంటూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా పడాలని మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.