రాప్తాడు: సనప గ్రామములో ఓసికేరప్పస్వామికి దేవీ నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక పూజలు 21 ద్రవాలతో అభిషేకాలు స్వామి వారికి నిర్వహించారు
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప గ్రామంలో సాయంత్రం 6:00 నుంచి 8:30 గంటల వరకు శ్రీఓసికేరప్పస్వామికి దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ప్రత్యేక అలంకరణ నిర్వహించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ,ఓసికేరప్ప పూజారప్ప తదితరులు మాట్లాడుతూ సనప గ్రామంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా ఓసికేరప్పస్వామికి 21 ద్రవాలతో ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించి భక్తులతో కలిసి ప్రతిరోజు భజన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తొమ్మిది రోజులు పాటు శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తామని సనప గ్రామస్తులు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.