రాయదుర్గం: వన్నల్లి గ్రామంలో పాముకాటుకు గురై రైతు మృతి
బొమ్మనహాల్ మండలంలోని వన్నల్లి గ్రామంలో పాముకాటుకు గురై రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన వన్నూరుస్వామి(55) మొక్కజొన్న పంటను సాగు చేశాడు. బుధవారం అర్ధరాత్రి పొలంలో మొక్కజొన్నలను ఆరబోసిన ప్లాస్టిక్ పట్టలపై కుక్కలు పొర్థాడుతుండటంతో వాటిని తరిమేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో చీకటిలో పట్ట కింద ఉన్న పామును పొరపాటున కాలుతో తొక్కడంతో పాము వెంటనే కాటు వేసింది. అతన్ని హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.