రాప్తాడు: గొందిరెడ్డిపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో మన అంగడి వాడి మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిఓ ఉమా శంకరమ్మ
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో గురువారం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో గొందిరెడ్డిపల్లి టు అంగన్వాడి కేంద్రంలో రాప్తాడు సిడిపిఓ ఉమా శంకరమ్మ మన అంగడి వాడి మన బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సిడిపిఓ ఉమా శంకరమ్మ మాట్లాడుతూ బాలింతలకు గర్భవతులకు పోస్టుగా ఆహారం పైన బాలామృతం పాలు గుడ్లు, సంజీవని కిట్ తదితర వాటిపైన అవగాహన కల్పించడం జరిగిందని అదేవిధంగా ఆరు నెలలు పూర్తయిన పిల్లలకు అనుబంధ ఆహారం గురించి కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పించడం జరిగిందని రాప్తాడు సిడిపిఓ ఉమా శంకరమ్మ పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో లీలావతి, ఈశ్వరమ్మ ,నాగలక్ష్మి, గర్భవతులు తదితరులంతా పాల్గొన్నారు.