కనిగిరి: కొమరోలు ఎంపీటీసీ నామినేషన్లు: 144 సెక్షన్ అమలు, పటిష్ఠ భద్రత
కొమరోలు ఎంపీటీసీ నామినేషన్ల నేపథ్యంలో కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్సై కోట నాగేంద్రరావు తెలిపారు. అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.