రాయదుర్గం: రైతులపై దౌర్జన్యం చేస్తున్న రిజోనియో పై కేసులు నమోదు చేయాలి : రైతు సంఘం నేత ప్రభాకర్ రెడ్డి
బొమ్మనహల్, కణేకల్ మండలాల్లో రైతులకు పరిహారం ఇవ్వకుండా అక్రమంగా హైటెన్షన్ విద్యుత్ టవర్లు నిర్మిస్తున్న రిజోనియా కంపెనీపై కేసులు నమోదు చేయాలని రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం బొమ్మనహాల్ వద్ద బాదిత రైతులతో మాట్లాడారు. రిజోనియోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని, కలెక్టర్ జోక్యం చేసుకోవాలని, లేకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని ప్రకటించారు