నారాయణపేట్: సెప్టెంబర్ 10న 'ఛలో హైదరాబాద్': ఉపాధ్యాయ సంఘాల పిలుపు
పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు వంటి డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 10న చేపట్టిన 'ఛలో హైదరాబాద్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీటీఎఫ్ నారాయణపేట జిల్లా శాఖ ఉద్యోగ, ఉపాధ్యాయులను కోరింది.