రాయదుర్గం: మాజీ సీఎం జగన్ను కలిసిన 43 ఉడేగోళం మోకా ఆంజనేయులు కుటుంబ సభ్యులు
బాదిత కుటుంబానికి అండగా ఉంటామని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల టిడిపి నాయకుల వేదింపులతో ఆత్మహత్య చేసుకున్న కణేకల్లు మండలంలోని 43 ఉడేగోళం గ్రామానికి చెందిన మోకా ఆంజనేయులు కుమారుడు వన్నూరస్వామికి భరోసా ఇచ్చారు. వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టువిశ్వనాథ్ రెడ్డితో కలసి మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ ను కలిశారు. గ్రామంలో అధికార పార్టీ దౌర్జన్యాలపై జరిగిన సంఘటనలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రాబోయే రోజుల్లో పార్టీకి మంచి రోజులు వస్తాయని, కష్టకాలంలో ధైర్యంగా నిలబడాలని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా న్యాయం జరుగుతుందని బరోసా ఇచ్చారు.