గిద్దలూరు: కొమరోలు లో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్సై నాగరాజు
మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణంలో ఆదివారం సైబర్ నేరాలపై ప్రజలకు ఎస్ఐ నాగరాజు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ బ్యాంకుకు సంబంధించిన ఖాతా వివరాలు ఓటిపి నంబర్లు అడిగితే చెప్పవద్దని బ్యాంక్ అధికారులు ఎవరు కూడా ఫోన్ చేసి మీ వివరాలు అడగరని ఎస్ఐ నాగరాజు తెలిపారు. ఓటిపి నంబర్లు చెప్పినట్లయితే సైబర్ నేరగాళ్లు మీ బ్యాంకు ఖాతా నుంచి నగదును దొంగలు ఇస్తారని ఎస్ఐ నాగరాజు ప్రజలను హెచ్చరించారు.