గిద్దలూరు: వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన అర్ధవీడు మండలం లక్ష్మీపురం, కృష్ణానగర్ గ్రామాలను కన్నీటితో విడుతున్న ప్రజలు
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం లోని లక్ష్మీపురం, కృష్ణానగర్ గ్రామానికి చెందిన గ్రామ ప్రజలు తమ గ్రామాలను వెళుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన ఈ రెండు గ్రామాల ప్రజలు ఈనెల 24వ తేదీ కల్లా గ్రామాలు విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. మూడు తరాలగా నివాసం ఉంటున్న సొంత గ్రామాలు ఇళ్లను పొలాలను విడిచిపెట్టి వెళ్లలేక గ్రామస్తులు కన్నీరు పెట్టుకుంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ దృశ్యాలు స్థానికంగా మనసును కదిలించాయి.