రాప్తాడు: శారదా నగర్ శివకోటి శ్రీ పీఠంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ నిర్వహించి పూజలు నిర్వహించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శారద నగర్ సమీపంలోనే ఉన్న శివకోటి శ్రీ పీఠంలో ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు శివకోటి శ్రీ పీఠంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు అమర్ పూజారి అప్పు స్వామి మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని మహాలక్ష్మి అలంకరణ నిర్వహించి మహిళల చేత ప్రత్యేక పూజలు సైతం నిర్వహించడం జరిగిందని రేపటి రోజు కూడా ప్రత్యేక హోమాన్ని నిర్వహించబోతున్నామని భక్తులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకుడు అమర్ పూజారి అప్పు స్వామి పిలుపునిచ్చారు.