గిద్దలూరు: గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లెలోని రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి, దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లె గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడ్డాడా లేదా రైలు పట్టాలు దాటుతూ మృతి చెందాడ అనే విషయాన్ని విచారణలో గుర్తించవలసి ఉందని అధికారులు అన్నారు. అయితే మృతదేహం గుర్తు పట్టలేని విధంగా నుజ్జునుజుగా కావడంతో మృతుడు వివరాలు గుర్తించడం కష్టతరంగా మారిందని అధికారులు చెప్పారు.