రాప్తాడు: రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల నామినేషన్ సందర్భంగా జడ్పిటిసి ఎంపిటిసి నామినేషన్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆన
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో బుధవారం 12 గంటల 45 నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎంపీటీసీ జడ్పిటిసి నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ రాప్తాడులో ఎంపీటీసీ, జడ్పీటీసీ 2026 కు సంబంధించిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించడం జరిగిందని నామినేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడం జరిగిందని నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి రవి, చెన్నకేశవులు, పాల్గొన్నారు.