రాప్తాడు: బొమ్మపర్తి గ్రామంలో దత్త మందిరంలో సచ్చిదానంద స్వామిని దర్శించుకున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని బొమ్మ ప్రతి గ్రామంలో శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి దత్త మందిరంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ బొమ్మేపర్తి గ్రామంలో దత్త మందిరం నందు ఏర్పాటు చేసిన పూజల్లో పాల్గొని సచ్చిదానంద స్వామి వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు రాప్తాడు మండలానికి చెందిన వైసిపి నేతలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.