కొండపి: ప్రకాశం జిల్లాలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల వివరాలను వెల్లడించిన కలెక్టర్ రాజాబాబు, నామినేషన్ల గడువు వివరాలు వెల్లడి
ప్రకాశం జిల్లాలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికలపై కలెక్టర్ రాజాబాబు వాటి వివరాలు బుధవారం వెల్లడి. ఈనెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లు ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. 19 నామినేషన్ను పరిశీలన నామినేషన్ ఉపసంహరించుకోవడానికి ఈనెల 21వ తేదీ వరకు గడువు ఉంటుందన్నారు. 28 పోలింగ్ 30 కౌంటింగ్ నిర్వహిస్తామని కలెక్టర్ మీడియా ముఖ్యంగా చెప్పారు. రీపోలింగ్ ఎక్కడైనా ఉన్నట్లయితే ఈనెల 29న నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజాబాబు తెలిపారు.