కనిగిరి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సూచించారు. కనిగిరి లోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో వైద్యులు, సిబ్బంది మరియు టిడిపి నాయకులతో కలిసి ఎమ్మెల్యే శనివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు అన్నారు. తద్వారా సకాలంలో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.