అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని శ్రీ శ్రీ చౌడేశ్వరీ దేవి ఆలయంలో ఈనెల 15న పంచమ జ్యోతుల మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వాహక కమిటీ సభ్యులు ఆదివారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. జ్యోతుల ఉత్సవంలో భాగంగా బాల చౌడేశ్వరి అమ్మవారి ఊరేగింపు, శ్రీ శ్రీ దివ్యజ్ఞానానందగిరి స్వామీజీ వారి దివ్య ఉపన్యాసం, అర్థరాత్రి 12:45 నిమిషాలకు జ్యోతుల ప్రారంభం, చెక్కభజన అనంత భజనలు డప్పుల నృత్యాలు కాంతారా నృత్య ప్రదర్శనలు ఉంటాయని కావున గురువారం నుండి శుక్రవారం సాయంత్రం వరకు జరిగే జ్యోతుల ఉత్సవంలో భక్తజనం పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు పేర్కొన్నారు.