కొత్తగూడెం: మురసు తుఫాను: పంటల సంరక్షణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
మురసు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వరి, మిరప పంటల సంరక్షణకు వ్యవసాయ శాఖాధికారి బాబురావు సూచనలు చేశారు. పొలాల్లోని నీటిని తొలగించడం, మొక్కలకు ఆధారం కల్పించడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో దాదాపు 3,100 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.