రాప్తాడు: నారా లోకేష్ జిల్లా పర్యటనలో రైతుల గురించి మాట్లాడకపోవడం అన్యాయం అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శ
అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరువు దీక్షలకు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మద్దతు తెలపడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి రోజున మంత్రి నారా లోకేష్ రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించడం జరిగిందని ఈ పర్యటనలో కార్యకర్తలను రెచ్చగొట్టడం తప్ప ఈ ప్రాంతంలో కరువు గురించి గానీ రైతు సమస్యల గురించి కూడా మాట్లాడకపోవడం అన్యాయమని ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని లేకుంటే పోరాటాలు చేస్తామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.