కనిగిరి: మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్దగల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.... అహింస, సత్యాగ్రహం ఆయుధాలుగా బ్రిటిష్ పాలకులను దేశం నుండి పారద్రోలిన మహోన్నత నాయకుడు గాంధీజీ అన్నారు. మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కనిగిరి కమిషనర్ శ్రీధర్, టిడిపి నాయకులు పాల్గొన్నారు.