యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తున్న నిర్వాసితులను ఆదరించాలని నిర్వాసితుడు చంద్రశేఖర్ రెడ్డి విజ్ఞప్తి
వెలుగొండ ప్రాజెక్టు కోసం పుట్టిన ఊరిని తరతరాల జ్ఞాపకాలను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పెద్దారవీడు మండలం గుండంచర్ల నిర్వాసితుడు చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు జిల్లాల ప్రజలకు తాగునీరు సాగునీరు కోసం త్యాగం చేస్తున్న నిర్వాసితులను ఆదరించాలని వేడుకొన్నారు. గ్రామాలను ఖాళీ చేసి వెళ్తున్న నిర్వాసితులను కుల మతాలకతీతంగా తలదాచుకోవడానికి చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు