మరిపెడ: మరిపెడ మండలంలోని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలని సిపిఐ డిమాండ్
మరిపెడ మండలంలోని 14 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ డిమాండ్ చేశారు. బస్సులు లేక ప్రజలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడి ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే బస్సు సర్వీసులు ప్రారంభించాలని కోరారు.