మరిపెడ: మరిపెడ శివారులో ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై టాటాఎస్ వాహనాన్ని ఢీకొన్న లారీ, ఇద్దరికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
మహబూబాబాద్ జిల్లా,మరిపెడ మండల కేంద్ర శివారు, నేతావత్ తండా సమీపం వద్ద ,వరంగల్ ఖమ్మం ప్రధాన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.మరిపెడకు వస్తున్న టాటా ఏసీ వాహనాన్ని, ఖమ్మం నుండి హనుమకొండ వైపు వెళ్తున్న ఓ లారీ ఢీ కొట్టింది, ఈ ఘటనలో మరిపెడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి,క్యాబిన్లో ఇరుక్కున్న ఇద్దరినీ స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది ,పూర్తి వివరాలు తెలియాల్సింది.