మరిపెడ: మరిపెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోరీ, తలుపులు, కిటికీలు ధ్వంసం చేసి విద్యుత్ ఉపకరణాలు, ఫ్యాన్లు ఎత్తుకెళ్లిన దొంగలు
గత రాత్రి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మరిపెడలో దొంగతనం జరిగింది .దుండగులు పాఠశాల కిటికీ ఊచలు వంచుకొని తరగతి గదులలోనికి ప్రవేశించి విద్యుత్ ఉపకారణాలను పగులు కొట్టి ఫ్యాన్లు ఎత్తుకెళ్లడం జరిగిందని. రెండు తరగతి గదుల తలుపులను .తరగతి గదిలో ఉన్న డ్యూయల్ బెంచ్ లను . కిటికీ రెక్కలను పగలగొట్టడం జరిగిందని. దీనిపై పోలీసు వారికి సమాచారం అందించి కేసు పెట్టడం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.