మరిపెడ: బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు మరిపెడలో ప్రభుత్వ విప్ రాంచంద్రనాయక్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు మొదలైందని అందుకే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ చేరుకొని రెండు గంటల పాటు మంతనాలు జరిపారని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ అన్నారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని హరీష్ రావు, కేటీఆర్ ,కేసీఆర్, కల్వకుంట్ల కవితల మధ్య సయోధ్య కుదరడం లేదని అందుకే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లి మంతనాలు జరిపారని అన్నారు ఇటీవల కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఎలుకతుర్తి సభలో హరీష్ రావుకు ఆహ్వానం ఇవ్వకపోవడమే నిదర్శనమని అన్నారు.