మరిపెడ: మరిపెడ మున్సిపల్ కేంద్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత, మున్సిపల్ సిబ్బంది, ఇంటి యజమానుల మధ్య వాగ్వాదం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని రామా విలాస్ గల్లీలో మున్సిపల్ అధికారులు రోడ్డు వెడల్పు పనులను చేపట్టారు. రామ విలాస్ గల్లీలో ఆక్రమణలో భాగంగా పలు గృహాలకు గతంలో అధికారులు నోటీసులు ఇచ్చారు.ఈ మేరకు ఈరోజు గల్లీలొ ఆక్రమణలో ఉన్న ఇళ్లను మున్సిపాలిటీ పోలీస్ రెవిన్యూ శాఖ అధికారుల ఆధ్వర్యంలో తొలగిస్తున్నారు. దీంతో ఇంటి యజమానులతో పాటు మున్సిపల్ సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది .దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.