నిజామాబాద్ నార్త్: భూముల రీ-సర్వేలో నిర్లక్ష్యం వద్దు: అధికారులను హెచ్చరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
భూముల రీ-సర్వే ప్రక్రియపై అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, నాణ్యతతో నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పారదర్శకంగా గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.