మాక్లూర్: మాక్లూర్ కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ: కాంట్రాక్ట్ ఏజెన్సీకి నోటీసులు
మాక్లూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరుకులు సక్రమంగా సరఫరా చేయని ఏజెన్సీకి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. విద్యార్థినుల భద్రత, ఆహార నాణ్యతపై అధికారులకు కీలక సూచనలు చేశారు.