మాక్లూర్: ఇందిరమ్మ జీవిత బీమా పథకం: ఈ నెల 19 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభం
నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 19 నుంచి ప్రత్యేక శిబిరాల్లో నమోదు ప్రక్రియ మొదలవుతుంది. ఆహార భద్రత కార్డు ఉన్నవారు ఎక్కడి నుంచైనా నమోదు చేసుకోవచ్చు. లబ్ధిదారులు స్వయంగా హాజరై సంతకం చేయాల్సి ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.