మాక్లూర్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం: ఈ నెల 19 నుంచి ప్రత్యేక నమోదు శిబిరాలు
నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 19 నుంచి ప్రత్యేక శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఆహార భద్రత కార్డు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడు స్వయంగా హాజరై సంతకం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.