రాప్తాడు: సోమలదొడ్డి శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో యువతకు భవిష్యత్తుకు భరోసా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లక్ష్మీనారాయణ
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సోమల దొడ్డి వద్ద ఉన్న శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో యువత భవిష్యత్తుకు భరోసా కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నర్సింగ్ కళాశాలలో డిప్లమా డిగ్రీ నర్సింగ్ విద్యను అభ్యసించే విద్యార్థినిలు సమాజంలో ఉత్తమ సేవా రంగంలో గుర్తింపు పొందడంతో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు మదర్ తెరిసా చేసిన సేవలకు ఎంతో గుర్తింపు వచ్చిందన్నారు అలాంటి సేవారంగంలో ఉన్న నర్సింగ్ విద్యార్థినీలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఎంపీ లక్ష్మీనారాయణ తెలిపారు.