కొండపి: నేటి యువతకు ఆంధ్రకేసరి, టంగుటూరి ప్రకాశం పంతులు ఆదర్శం: ప్రకాశం పంతులు ముని మనవడు సంతోష్ కుమార్
నేటి యువతకు ఆంధ్రకేసరి, టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఆదర్శమని ఆయన ముని మనవడు టంగుటూరి సంతోష్ కుమార్ తెలిపారు. ఒంగోలులో ప్రకాశం పంతులు జయంతి వేడుకల అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ తాతయ్య జయంతిని ప్రభుత్వం ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. చివరి క్షణం వరకు ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ఘనత ప్రకాశం పంతులుకు దక్కుతుందన్నారు.