రాయదుర్గం: పురాతన ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో జాప్యం, VHP నేతల ఆగ్రహం
రాయదుర్గం పట్టణంలో ప్రాచీన దేవాలయం శ్రీ ప్రసన్న వెంకటరమణ దేవస్థానం ప్రహరీ, పుష్కరిణి పనులు మూడేళ్లుగా పడేశారు. పనుల జాప్యంపై భక్తులువిశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు దేవరెడ్డిపల్లి రాజేష్, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాయదుర్గంలో రాజేష్ మాట్లాడుతూ 2023 ఏడాదిలో రూ. 4 కోట్ల 15 లక్షలు మంజూరైనా 3 ఏళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ, ఎండోమెంట్ నిధులతో పాటు స్థానిక భక్తుల విరాళాలు 30 లక్షలు ఇచ్చినా పనుల జాప్యంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు.