కనిగిరి: పట్టణంలో వైసిపి ఇన్చార్జి నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి కార్యక్రమం
కనిగిరి పట్టణంలో వైసిపి ఆధ్వర్యంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి పోలీస్ స్టేషన్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి వైసీపీ కనిగిరి నియోజకవర్గం ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఎంతో గొప్పదని, ఆయన ఆశయ సాధనలో భాగంగా గ్రామ స్వరాజ్య స్థాపన ధ్యేయంగా వైసిపి ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పనిచేశారన్నారు. అందులో భాగంగానే సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు.