దర్శి: తాళ్లూరు మండలంలో 48 పాఠశాలలలో ఎస్ఎంసి ఎన్నికలు
Darsi, Prakasam | Sep 29, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని 48 ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎంసి ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాల పరిధిలోని వివిధ పార్టీ నాయకులు బలపరిచిన అభ్యర్థులు పోటీలో గెలుపొందారు. గెలుపొందిన వారు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం కావాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.