యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 768 కోట్ల పరిహారం: రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి రామానాయుడు
వెలగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు 768 కోట్ల రూపాయలు పరిహారం అందించామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయని విధంగా కూటమి ప్రభుత్వం చేసింది అన్నారు. త్వరలో కృష్ణా జలాలను వెలుగొండ ప్రాజెక్టుకు సీఎం చేతుల మీదుగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 30 సంవత్సరాల కాలంలో నిర్వాసితులకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని విమర్శించారు.