రాప్తాడు: అనంతపురంలో పదిమంది దివ్యాంగులకు 12 లక్షల 50 వేల రూపాయలు విలువైన ద్విచక్ర వాహనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం 12 గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గానికి చెందిన పదిమంది దివ్యాంగులకు 100% సబ్సిడీతో కూడిన ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నారాయణస్వామి సహకారంతో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన పదిమంది దివ్యాంగులకు ఒక్కొక్క ద్విచక్ర వాహనం 1,25,000 విలువైన ద్విచక్ర వాహనాన్ని 100% సబ్సిడీతో వికలాంగులకు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దివ్యాంగులు, దివ్యాంగుల కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.