సంతనూతలపాడు: రాష్ట్రస్థాయి జూనియర్ హాకీ పోటీలకు ఎంపికైన సంతనూతలపాడు మండలం బొమ్మినేని వారి పాలెం కు చెందిన విద్యార్థులు
సంతనూతలపాడు మండలం బొమ్మినేని వారి పాలెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి జూనియర్ హాకీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేసిరెడ్డి ఆదివారం తెలిపారు. పాఠశాలకు చెందిన సూరజ్ బాబు, వినూత్న కుమార్ జూనియర్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఆగస్టు 24 నుండి 28వ తేదీ వరకు తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొంటారని ఆయన అన్నారు.