ఉరవకొండ: మలేరియా డెంగ్యూ నియంత్రణకు గంబుషియా చేపలు వదలిన వైద్యశాఖ అధికారులు
అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు మరియు జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మనోజ్ కుమార్ ల ఆదేశాల మేరకు వజ్రకరూరు మండలంలోని చాబాల సచివాలయ పరిధిలోని ఈశ్వరుని గుడి పక్కన నిల్వ ఉన్న మంచినీటి కుంటల్లో దోమ లార్వా నిర్మూలన కోసం బుధవారం నాడు ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరాం రెడ్డి అనంతపురం ఫిసిరిస్ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చిన గంబుషియా చేప పిల్లల్ని వదలడం జరిగింది. అలాగే చాబాల గ్రామంలో ఫీవర్ సర్వే మరియు దోమ లార్వా వెరిఫికేషన్ చేయడం జరిగింది.