దర్శి: రాబోయే ఎన్నికల్లో ఓటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Aug 22, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు టిడిపి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలుపు దీక్షగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కేటాయించడం పై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.